Skip to content

“పళ్లి చట్టంబి” ఏప్రిల్ 9న రిలీజ్

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ "పళ్లి చట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రోజు "పళ్లి చట్టంబి" సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ ద్వారా సినిమా రిలీజ్ డేట్ ను కూడా వెల్లడించారు. ఏప్రిల్ 9న ఈ ప్రెస్టీజియస్ మూవీని హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు…

Read more

‘మైసా’ నుంచి టీజర్ రిలీజ్

నేషనల్ క్రష్ రష్మిక లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న ఫీమేల్ -సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మైసా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రవీంద్ర పుల్లే దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఆకట్టుకున్న టైటిల్‌, ఫస్ట్ లుక్ పోస్టర్‌ల తర్వాత, తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. వణుకు పుట్టించే ఈ టీజర్, మైసా పాత్ర డార్క్ అండ్ ఇంటెన్స్ ప్రపంచాన్ని ప్రజెంట్ చేసింది. కథానాయిక తల్లి గొంతుతో వచ్చే ‘నా బిడ్డ ఊపిరి మోయలేక అగ్గే బూడిదైంది. నా బిడ్డను సంపలేక.. ఆఖరికి సావే సచ్చిపోయింది’ అనే పవర్ ఫుల్ వాయిస్ తో టీజర్…

Read more