Skip to content

‘జనవరి 12 విడుదల’ నుంచి కీర్తి సురేష్ రస్టిక్, ట్రెడిషనల్ ఫస్ట్ లుక్ రిలీజ్

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘జనవరి 12 విడుదల’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఇప్పటికే వెంకటేష్, కల్యాణ్ రామ్, కృతిశెట్టి ఫస్ట్ లుక్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా, హీరోయిన్ కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న లతారెడ్డి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కీర్తి సురేష్…

Read more

#జనవరి 12 విడుదల’ ఊటీలో కీలక షెడ్యూల్ ప్రారంభం

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘జనవరి 12 విడుదల’. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ను చిత్ర బృందం ఊటీలో ప్రారంభించింది. సుందరమైన ప్రకృతి అందాల నడుమ ఈ షెడ్యూల్ జరగనుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి, అజయ్ ఘోష్, ఉపేంద్ర లిమాయే సహా ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్‌లో రెండు…

Read more

‘జనవరి 12 విడుదల’ నుంచి దీపుగా కృతి శెట్టి ట్రెడిషనల్ ఫస్ట్ లుక్‌ రిలీజ్

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్ ఫెస్టివ్ ఎంటర్‌టైనర్ ‘జనవరి 12 విడుదల’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి ఆర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ ఆసక్తిని పెంచుతోంది. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్ర టైటిల్‌ను మేకర్స్ ఇటీవల హిలేరియస్, ఎంటర్‌టైనింగ్ వీడియో ద్వారా ప్రకటించారు. దీంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది. ఇప్పటికే వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్స్‌ను పరిచయం చేసిన మేకర్స్.. తాజాగా హీరోయిన్ కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమెను ‘దీపు’…

Read more