జీ5లో గ్రాండ్గా ప్రారంభమైన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2
అక్టోబర్ 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్.. అక్టోబర్ 18 నుంచి జీ తెలుగు టెలివిజన్లో ప్రసారం మన మనసులో నిలిచిపోయే సంభాషణలు చాలాసార్లు మనకు తెలిసిన విషయాలను దాటి, ఒక వ్యక్తిలోని అసలైన మనిషిని పరిచయం చేస్తాయి. జీ తెలుగు పాపులర్ సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి’ రెండో సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్కు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి అతిథిగా హాజరుకానున్నారు. సహజమైన నటనతో, ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్తో, అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న సాయి పల్లవి.. ఈ షో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో సందడి చేయనున్నారు. మనసులోని మాటలను నిక్కచ్చిగా బయటకు తెలిజయేసే సంభాషణలు,…
