“మిస్టీరియస్”.. ప్రీ రిలీజ్ ఈవెంట్
మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో అశ్లీ క్రియేషన్స్ పై జయ్ వల్లందాస్ నిర్మిస్తున్న “మిస్టీరియస్” నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా జరుపుకుంది. ఈ సందర్బంగా దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయినా.. నిర్మాత గారు చాలా పట్టుదలతో తీశారు. సినిమా చేస్తున్న టైంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఏర్పాట్లు చేశాడు. అందుకే ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది. ఒక కొత్త స్క్రీన్ ప్లే తో పూర్తిగా సస్పెన్స్ తో వున్న ఈ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకుడిని ఆద్యంతం ఒక కొత్త అనుభూతికి లోను చేస్తుందని చెప్పారు. ఇక నిర్మాత జయ్ వల్లందాస్ మాట్లాడుతూ.. మా డైరెక్టర్ మహితో కలిసి మూవీ చేస్తామని…
