‘ఐ హేట్ మ్యారేజ్’ చిత్రం నుంచి అప్పుడే పెళ్లా? లిరికల్ సాంగ్ విడుదల
సుగి విజయ్, జుప్సీ భద్ర, హారిక రాజేందర్ హీరో హీరోయిన్లుగా పరమేష్ రేణుకుంట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న విభిన్న ప్రేమకథా చిత్రం 'ఐ హేట్ మ్యారేజ్', ఆర్య సినిమా పతాకపంపై దయానంద్ మాదం, కార్తీక్ వెంపటి నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ చివరి వారంలో విడుదల కానుంది. కాగా సోమవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఈ చిత్రంలోని అప్పుడే పెళ్లా అనే లిరికల్ వీడియోను ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ విడుదల చేశారు. వరికుప్పల యాదగిరి రచించి, స్వరాలు సమాకూర్చిన ఈ పాటను సాహితి చాగంటి ఆలపించారు. ఈ సందర్భంగా బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ఈ సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. ఈ సినిమా రూపొందిన విధానం నన్ను అలరించింది. తమ స్నేహితుడిని…
