ఐఎఫ్‌ఎఫ్‌డి 2026లో ‘భగవంత్ కేసరి’ ప్రదర్శన
అంతర్జాతీయ ఢిల్లీ చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌డి) 2026లో భాగంగా తెలుగు సినీ దిగ్గజం, లెజెండరీ నటుడు నందమూరి బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఐదు దశాబ్దాల అసాధారణ సినీ వారసత్వాన్ని, చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తుగా ప్రతిష్టాత్మకమైన భరత్ మండపంలో జరిగిన అంతర్జాతీయ ఢిల్లీ చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌డి) 2026లో తెలుగు సినిమా దిగ్గజం నందమూరి బాలకృష్ణకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. 50 ఏళ్ల ప్రస్థానంలో భారతీయ సినిమాకు ఆయన చేసిన అపారమైన సేవకు గుర్తింపుగా, నటన కళ పట్ల ఆయనకున్న చెరగని ప్రభావం, బహుముఖ ప్రజ్ఞ, అసమానమైన అంకితభావానికి నివాళిగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. మార్చి 25న న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు…
