కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ ప్రీ రిలీజ్ వేడుక
▪️జూలై 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ ▪️ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా వేడుక ▪️తెలంగాణ ఉద్యమకారిణి కోమలి సినిమాను ఆదరించాలి: కల్వకుంట్ల కవిత ▪️ చిన్న సినిమాలకు ప్రభుత్వం రాయితీలు కల్పించాలి: కల్వకుంట్ల కవిత ▪️"ఒక ఆడబిడ్డ కన్నీటి కథే ఈ సినిమా" –నిర్మాత కోమలి హైదరాబాద్: ప్రముఖ జానపద గాయని కోమలి నిర్మాతగా మారుతూ నిర్మించిన భావోద్వేగ కుటుంబ కథా చిత్రం 'వెంకట్రామయ్య గారి తాలూకా' జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దినేష్ కుమార్ హీరోగా, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్గా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సతీష్ ఆవాల కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్…
