#VenkyAnil5 #NkrAR2 రేపటి నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో మోస్ట్ ఎవైటెడ్ ఎంటర్టైనర్ (#VenkyAnil5 #NkrAR2) రూపొందుతోంది. 'షైన్ స్క్రీన్స్' బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. వెంకటేష్ , కళ్యాణ్ రామ్ సరసన కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇటివలే ఘనంగా జరిగిన పూజా కార్యక్రమంతో ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా, హైదరాబాద్‌లో రేపటి నుంచే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని ఒక ఫన్ వీడియో ద్వారా వెల్లడించారు. సినీ పరిశ్రమలో ప్రమోషన్ల విషయంలో కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్న దర్శకుడు అనిల్…
