విరాట్ హీరోగా ‘రుస్తుం’ సినిమా అనౌన్స్‌మెంట్
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ తమ కొత్త సినిమాను ప్రకటించింది. విరాట్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘రుస్తుం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. డెబ్యూ డైరెక్టర్ కనిష్క గంధం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. విరాట్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ సినిమా ప్రపంచాన్ని ఆసక్తికరంగా పరిచయం చేస్తోంది. ‘రుస్తుం’ అనే టైటిల్‌కు గతంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్ సినిమాకు ఇదే టైటిల్ కావడం విశేషం. ఇప్పుడు మేకర్స్ సరికొత్త విజన్‌తో ఈ టైటిల్‌ను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ఒక ఇంటెన్స్, డిఫరెంట్ యాక్షన్…
