‘జాకీ – నో రీటేక్స్ అలౌడ్’ -స్టైలిష్ యాక్షన్ ఫస్ట్ లుక్ రిలీజ్
తెలుగు సినిమాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను విస్తరిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేస్తోంది. తమిళంలో నిర్మిస్తున్న తమ నాలుగో చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ ధృవ్ విక్రమ్ తో తెరకెక్కిస్తోంది. నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన, ఇంటెన్స్ పాత్రల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధృవ్ విక్రమ్.. ఇప్పుడు మరింత మంది ప్రేక్షకులను కనెక్ట్ చేసే కమర్షియల్ సబ్జెక్ట్‌తో రాబోతున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘జాకీ -…
