ఈ సందర్భంగా జరిగిన హృద్యపూర్వక సమావేశంలో, ఆర్.పి. పట్నాయక్ ఎస్వీబీసీ ఛైర్మన్‌కు తన ఇటీవలి భక్తి…
‘జాకీ – నో రీటేక్స్ అలౌడ్’ -స్టైలిష్ యాక్షన్ ఫస్ట్ లుక్ రిలీజ్
తెలుగు సినిమాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను విస్తరిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేస్తోంది. తమిళంలో నిర్మిస్తున్న తమ నాలుగో చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ ధృవ్ విక్రమ్ తో తెరకెక్కిస్తోంది. నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన, ఇంటెన్స్ పాత్రల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధృవ్ విక్రమ్.. ఇప్పుడు మరింత మంది ప్రేక్షకులను కనెక్ట్ చేసే కమర్షియల్ సబ్జెక్ట్‌తో రాబోతున్నారు.
తాజాగా మేకర్స్ ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘జాకీ – నో రీటేక్స్ అలౌడ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్‌లో ధృవ్ విక్రమ్‌ను ఫుల్ మాస్, లార్జర్ దేన్ లైఫ్ అవతార్‌లో ప్రజెంట్ చేశారు. గ్రిట్టీ లైవ్ యాక్షన్ ట్రీట్‌మెంట్‌ను స్టైలిష్ కామిక్ బుక్ తరహా విజువల్‌తో మిక్స్ చేసిన ఈ పోస్టర్.. సినిమా కాన్సెప్ట్‌పై ఆసక్తిని పెంచుతోంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని ధృవ్ పాత్ర క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.
బ్రౌన్ కలర్ అవుట్‌ఫిట్‌లో, డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో, ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్‌తో ధృవ్ విక్రమ్ కనిపిస్తున్నారు. ఆయన ఫియర్స్ పోజ్ క్యారెక్టర్ కమాండింగ్ ప్రెజెన్స్‌ను మరింత ఎలివేట్ చేస్తోంది. ఇక ముందుకు చాచిన పిడికిలి పోస్టర్‌కు ఫుల్ యాక్షన్ ఫీల్‌ను తీసుకొచ్చింది. “No Retakes Allowed” అనే ట్యాగ్‌లైన్ సినిమా ఎడ్జీ టోన్‌ను మరింత పెంచుతోంది.
ఈ ఫస్ట్ లుక్‌తో ‘జాకీ’ స్టైలిష్, యాక్షన్-డ్రివెన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తన మార్క్ చూపిస్తోంది. అదే సమయంలో ధృవ్ విక్రమ్ సరికొత్త పవర్‌ఫుల్ స్క్రీన్ పర్సనాను కూడా పరిచయం చేస్తోంది.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా, వికీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జయసూర్య ఎడిటర్‌గా, జీఎం శేఖర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ విక్రమ్ మోర్ ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేస్తున్నారు.
తారాగణం: ధృవ్ విక్రమ్
సాంకేతిక సిబ్బంది:
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవి శంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
దర్శకత్వం: కరణ్ అరవింద్ కుమార్
సంగీతం: సంతోష్ నారాయణన్
DOP: వికీ
ఎడిటింగ్: జయసూర్య ఎస్
ప్రొడక్షన్ డిజైన్: GM శేఖర్
యాక్షన్: విక్రమ్ మోర్
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

