“K-ర్యాంప్”లో ఫన్ ఎంటర్ టైన్ మెంట్ కు లోటు ఉండదు – డైరెక్టర్ జైన్స్ నాని
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "K-ర్యాంప్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. "K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో ఈ సినిమాలోని హైలైట్స్ తెలిపారు దర్శకుడు జైన్స్ నాని. - "K-ర్యాంప్" అనే టైటిల్ ఈ కథకు సరిపోతుందనే పెట్టాం. బూతు పదం అని ఆలోచించలేదు. ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్ పేరు కుమార్. కథానుసారం అతని క్యారెక్టర్ ఇబ్బందుల్లో…
