21 నుంచి సోనీ లివ్‌లో ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రీమియర్
ఫస్ట్ లవ్‌ను సరికొత్తగా ఆవిష్కరిస్తూ, హృదయాన్ని హత్తుకునే కథనంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ రొమాంటిక్ డ్రామా ఆగస్టు 21న సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హృదయాన్ని హత్తుకునే కథనం, మనసుకు హాయినిచ్చే సంగీతం, ఆకట్టుకునే నటీనటుల పెర్ఫార్మెన్స్తో థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా రూ.60 కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. రవి నంబూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రవి నంబూరి, సాయి రాజేష్ నీలం స్క్రీన్‌ప్లే అందించారు. సాయి రాజేష్ కథను అందించగా.. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ…
