Skip to content

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ఆశపడే ఔత్సాహిక నటీనటుల, సాంకేతిక నిపుణులకు అండగా నిలబడుతూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజేశ్వర్ రెడ్డి వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద శ్రీ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. సాయి తేజ్ కిరణ్ అబ్బవరం గత సినిమాల్లో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేశాడు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి. మునిరాజు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. వి.మునిరాజు కిరణ్ అబ్బవరం మూవీస్ కు ఆన్ లైన్ ఎడిటింగ్ చేసేవారు. "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఆసక్తిని కలిగిస్తున్నాయి…

Read more

” K-ర్యాంప్” మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా " K-ర్యాంప్". కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 11వ చిత్రమిది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. " K-ర్యాంప్" సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటున్న " K-ర్యాంప్" సినిమా తాజాగా కేరళ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇక్కడి బ్యూటిఫుల్ లొకేషన్స్ లో చిత్రీకరించిన సీన్స్ మూవీలో ఐ ఫీస్ట్ గా ఉండబోతున్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన హీరో కిరణ్ అబ్బవరం…

Read more

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న కిరణ్ అబ్బవరం

షార్ట్ ఫిలింస్ స్థాయి నుంచి హీరోగా తనకొక స్థాయి సంపాదించుకునే వరకు ఎదిగారు కిరణ్ అబ్బవరం. ఈ క్రమంలో ఫిలింమేకింగ్ లో ఆయన ఎన్నో ఇబ్బందులు, కష్టాలు చూశారు. ఎవరి సపోర్ట్ లేకుండా గుర్తింపు తెచ్చుకున్నారు. స్ట్రాంగ్ కంటెంట్, ఇన్నోవేటివ్ మేకింగ్ తో మూవీస్ చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ కష్టాలు తెలిసిన హీరో కాబట్టే తనలా ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ఆశపడే ఔత్సాహిక నటీనటుల, సాంకేతిక నిపుణులకు అండగా నిలుస్తానని దిల్ రూబా సినిమా ఈవెంట్స్ లో చెప్పారు కిరణ్ అబ్బవరం. చెప్పినట్లే తన మాట మీద నిలబడుతూ కొత్త వాళ్లతో తన సొంత బ్యానర్ పై మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారాయన. తన గత సినిమాల్లో కెమెరా…

Read more

ఎగ్జైటింగ్ స్క్రిప్ట్స్, స్ట్రాంగ్ కంటెంట్ తో థియేట్రికల్ గా ఎంజాయ్ చేసే సినిమాలే నిర్మిస్తా – సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్

మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ లో "బేబి" వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు సక్సెస్ ఫుల్ యంగ్ నిర్మాత ఎస్ కేఎన్. ఆయన నిర్మాణంలో ప్రస్తుతం రశ్మిక మందన్న "ది గర్ల్ ఫ్రెండ్", కిరణ్ అబ్బవరం "చెన్నై లవ్ స్టోరీ", సంతోష్ శోభన్, అలేఖ్య హారిక మూవీ, హిందీ "బేబి"తో పాటు ఇద్దరు కొత్త దర్శకులతో ఇంట్రెస్టింగ్ మూవీస్ రాబోతున్నాయి. రేపు (జూలై 7న) పుట్టినరోజు జరుపుకుంటున్న ఎస్ కేఎన్ నిర్మాతగా తన కెరీర్ విశేషాలను, ప్రస్తుతం చేస్తున్న మూవీస్ ప్రోగ్రెస్ ను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు. - నేను మెగా ఫ్యామిలీ అభిమానిని. ఆ కుటుంబానికి దగ్గరగా ఉండాలనే కోరికతో…

Read more