‘ది ఇండియన్ బార్డర్’ మంచి విజయం సాధించాలి- మేజర్ ఎస్పీఎస్ ఒబేరాయ్
ఆర్ట్ ఇన్ హార్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద నివేద్య రెడ్డి నిర్మాణంలో డి.ఎస్. బాషా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది ఇండియన్ బార్డర్’. ఈ సినిమాలో కిరణ్ యార్లగడ్డ, ఆదర్ష్, మురళీ మోహన్, మేఘా శ్రీ, సిందు తులాని ముఖ్య పాత్రలను పోషించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ దేశ భక్తి గీతాన్ని విడుదల చేశారు. ‘జిందా రహేన్ తో డ్యూటీ’ అంటూ సాగే ఈ పాట ఉత్తేజాన్ని రేకెత్తించేలా ఉంది. గూస్ బంప్స్ ఇచ్చేలా, నరనరాల్లో దేశభక్తిని రగిల్చేలా ఈ పాట సాగింది. ఇక ఈ పాటకు ఆనంద్ మంత్ర బాణీ, డి.ఎస్. బాషా సాహిత్యం, శరవణ గాత్రం దేశ భక్తి గీతంగా మార్చేసింది. జవాన్ల త్యాగాల్ని, ధైర్య…
