ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్
* ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్న లాడియా (LADIA) సంస్థ ఖమ్మంలో తన ఏడో స్టోర్‌ను ఘనంగా ప్రారంభించింది. “డైమండ్స్ అందరికీ” అనే లక్ష్యంతో, వినూత్నత, విశ్వసనీయత మరియు కస్టమర్-ఫస్ట్ విధానంతో ముందుకు సాగుతున్న లాడియా, ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ ప్రపంచాన్ని కొత్త దిశగా తీసుకెళ్తోంది. ఖమ్మంలోని ఈ నూతన స్టోర్‌ను ప్రముఖ నటి నేహా శెట్టి అట్టహాసంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లాడియా డైరెక్టర్ అఖిల్ వేములూరి మాట్లాడుతూ, “ల్యాబ్-గ్రోన్ డైమండ్ రంగంలో భారత్ విశేష పురోగతి సాధించింది. ఈ రంగంలో మరిన్ని వినూత్న ఆలోచనలను అందిస్తూ ఆ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి లాడియా కట్టుబడి ఉంది. తెలంగాణలోని…
