శివాజీ ‘M3’ షూటింగ్ పూర్తి.. డిసెంబర్లో రిలీజ్
శివాజీ ప్రధాన పాత్రలో STBL సినిమాస్ నిర్మాణ సంస్థ తొలి చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పూర్తయింది. రవికృష్ణ, కసిరెడ్డి, భరణ్, ఖుష్బూ, రాధ్య, మౌనిక కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ ‘M3’. 72 రోజుల పాటు సాగిన షూటింగ్ను చిత్ర యూనిట్ విజయవంతంగా పూర్తి చేసింది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్లో శివాజీ సంప్రదాయ దుస్తుల్లో హుందాగా కనిపించారు. శివాజీ పాత్ర ఎలా ఉండబోతోందన్న ఆసక్తిని ఈ లుక్ మరింత పెంచుతోంది. STBL Cinemas సంస్థ ద్వారా బాలాజీ V.R. దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మంచి యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించారు. కుటుంబ కథా చిత్రాలు తగ్గుతున్న ప్రస్తుత రోజుల్లో, కుటుంబంలోని…
