Skip to content

జనవరి 14న థియేటర్లలో అందరం హాయిగా నవ్వుకుందాం.” -నవీన్‌ పొలిశెట్టి

2026 సంక్రాంతికి రాబోతున్న సినిమాలలో ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం 'అనగనగా ఒక రాజు'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వరుసగా మూడు ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంతో మారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి మొదటి గీతం 'భీమవరం బల్మా' తాజాగా విడుదలైంది. 'భీమవరం బల్మా' గీతావిష్కరణ వేడుక గురువారం సాయంత్రం భీమవరంలోని ఎస్.ఆర్.కె.ఆర్. ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగింది. యువత కోలాహలం నడుమ…

Read more

‘అనగనగా ఒక రాజు’ చిత్రం నుంచి ‘భీమవరం బల్మా’ విడుదల

వరుసగా మూడు ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి, 2026 సంక్రాంతికి తన తదుపరి చిత్రం 'అనగనగా ఒక రాజు'తో అలరించనున్నారు. ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా మొదటి గీతం విడుదలైంది. 'భీమవరం బల్మా' పేరుతో వచ్చిన ఈ పాట, కాస్త ముందుగానే పండుగ వాతావరణాన్ని తీసుకొని వచ్చింది. మాస్ ప్రేక్షకులతో పాటు, యువత మెచ్చేలా 'భీమవరం బల్మా' గీతం ఉంది. ఈ పాటతో మొదటిసారి గాయకుడిగా మారిన నవీన్‌ పొలిశెట్టి, తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నారు. వినోదాన్ని పంచడంలోనే కాదు, పాటను ఆలపించడంలోనూ దిట్ట అనిపించుకున్నారు. ఇక కథానాయిక మీనాక్షి చౌదరితో కలిసి ఈ…

Read more