Skip to content
‘అనగనగా ఒక రాజు’ చిత్రం నుంచి   ‘భీమవరం బల్మా’ విడుదల Telugu News

‘అనగనగా ఒక రాజు’ చిత్రం నుంచి ‘భీమవరం బల్మా’ విడుదల

వరుసగా మూడు ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి, 2026 సంక్రాంతికి తన తదుపరి చిత్రం 'అనగనగా ఒక రాజు'తో అలరించనున్నారు. ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా మొదటి గీతం విడుదలైంది. 'భీమవరం బల్మా' పేరుతో వచ్చిన ఈ పాట, కాస్త ముందుగానే పండుగ వాతావరణాన్ని తీసుకొని వచ్చింది. మాస్ ప్రేక్షకులతో పాటు, యువత మెచ్చేలా 'భీమవరం బల్మా' గీతం ఉంది. ఈ పాటతో మొదటిసారి గాయకుడిగా మారిన నవీన్‌ పొలిశెట్టి, తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నారు. వినోదాన్ని పంచడంలోనే కాదు, పాటను ఆలపించడంలోనూ దిట్ట అనిపించుకున్నారు. ఇక కథానాయిక మీనాక్షి చౌదరితో కలిసి ఈ…

Read more