మాదాల రవికి పుట్టినరోజు శుభాకాంక్షలు
మాదాల రంగారావు తీసిన ‘ఎర్రమల్లెలు’ చిత్రంతో బాల నటుడిగా పరిచయమయ్యారు మాదాల రవి. ఆ చిత్రంలోని "నాంపల్లి స్టేషన్ కాడి’ అనే పాట ఇప్పటికీ చార్ట్ బస్టర్‌గానే నిలుస్తోంది. ఆయన రష్యాలో ఇంటర్నల్ మెడిసిన్‌లో ఎండీ, గ్యాస్ట్రోఎంటరాలజీలో డీఎం పూర్తి చేశారు. అలాగే ఒక ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆయన రష్యాలో భారతీయ సంస్థలకు, సాంస్కృతిక వ్యవహారాల విభాగానికి సాంస్కృతిక కార్యదర్శిగా కూడా సేవలందించారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, ఆయన తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి 'నేను సైతం', 'మా ఇలవేల్పు', 'బ్రోకర్ 2', 'పంచముఖి', 'వీరగాధ', 'ఆజ్ కా ఇంక్విలాబ్', 'నాగ్ లక్ష్మి' వంటి అనేక చిత్రాలలో కథానాయకుడిగా నటించి, నిర్మించారు. ఆయన…
