Skip to content

పోతరాజు ఆహార్యంలో మేఘాంశ్‌ శ్రీహరి

నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు, వైవిధ్యమైన సినిమాలు చేసి తనకంటూ ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాందించుకున్న లెజెండరీ నటుడు రియల్‌స్టార్‌ డా. శ్రీహరి. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన మేఘాంశ్‌ శ్రీహరి హీరోగా భైరవకాళి బ్యానర్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. లెల్లా రోహిత్‌ దర్శకత్వంలో లెల్లా రాహుల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిలో బాగమైన పోతురాజు ఆహార్యంలో ఉన్న హీరో ఫస్ట్ లుక్ నీ ఆగస్టు 15న (రేపు) శ్రీ హరి గారి పుట్టినరోజు సందర్బంగా చిత్ర బృందం విడుదల చెసింధి. ఈ లుక్‌లో తనయుడు మేఘాంశ్‌ శ్రీహరికి అండగా వెనుక పోతురాజు ఆహార్యంలో రియల్‌స్టార్‌ డా. శ్రీహరికి కూడా కనిపిస్తుండటంతో ఈ లుక్‌ మరింత పవర్‌ఫుల్‌గా…

Read more

హుషారు పిట్టలు – సినిమా రివ్యూ

నటీనటులు: అన్షు, వాసవి గణేషన్, గోవర్థన్, సునీత్ మనోహర్, రమేష్, అంజి వల్గుమన్, ప్రణి రెడ్డి తదితరులు దర్శకత్వం: బిక్షు కొయగుర నిర్మాత: వెంకట్ యాదవ్ బ్యానర్: రుద్ర క్రాంతి పిక్చర్స్ సంగీతం: చరణ్ అర్జున్ సినిమాటోగ్రఫీ: రుద్ర సాయి ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్ కథ, కథనం యూత్, ప్రేమ, స్నేహం, కుటుంబ బంధాలు, తల్లిదండ్రుల బాధ్యత వంటి అంశాలను కలిపి తెరకెక్కించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘హుషారు పిట్టలు’. యువత జీవితంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు వారి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయి, తల్లిదండ్రుల పాత్ర ఎంత ముఖ్యమైనది అనే అంశాలను వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం ఈ సినిమాలో కనిపిస్తుంది. దర్శకుడు బిక్షు తన చుట్టూ జరిగిన వాస్తవ సంఘటనల స్ఫూర్తితో…

Read more

బర్క్‌లీ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ స్కూల్‌ ఎన్‌సెంబల్‌ ఎక్సెలన్స్‌ అవార్డును ఎంపికైన సుకృతి వేణి బండ్రెడ్డి!

పుష్ప, పుష్ప-2 చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు పొంది. ఇటీవల జాతీయ అవార్డుల్లో ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఘనత పొందిన ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సుకుమార్‌ బాటలోనే ఆయన తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి కూడా విభిన్న బాటలో పయనిస్తున్నారు. 2024 సంవత్సరానికి జాతీయ ఉత్తమ బాల నటిగా 'గాంధీ తాత చెట్టు' చిత్రానికి గాను అవార్డు సాధించిన సుకృతి వేణి ఇప్పుడు మరో అరుదైన ఘనతను కైవసం చేసుకుంది. అమెరికాలోని బోస్టన్‌లో ఉండే అంతర్జాతీయ బర్క్‌లీ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ స్కూల్‌లో సంగీత విభాగంలో ఎన్‌సెంబల్‌ ఎక్సెలన్స్‌ అవార్డును ఎంపికై ఫుల్‌ స్కాలర్‌షిప్‌ను సొంతం చేసుకుంది. Boston లోని Berklee College…

Read more

‘హుషార్‌ పిట్టలు’ చిత్రం నుంచి ‘టోంగా.. టోంగా’ పాట విడుదల

ఆగస్టు 15న చిత్రం విడుదల అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్‌ సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. కాగా తాజా ఈ చిత్రం నుంచి టోంగా టోంగా అనే ఓ హుషారు గీతాన్ని బుధవారం విడుదల చేశారు. చరణ్‌ అర్జున్‌ సంగీత దర్శకత్వంలో ఎస్‌.ఎస్‌.చిరంజన్‌ సాహిత్యంతో, మెయిన్‌…

Read more
‘దూరదర్శిని’  ట్రైలర్‌ విడుదల Telugu News

‘దూరదర్శిని’ ట్రైలర్‌ విడుదల

సువిక్షిత్‌, గీతికా రతన్‌ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌గుడ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'దూరదర్శిని'. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్‌ పతాకంపై జయ శంకర్‌ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం మే 15న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. దర్శకుడు మాట్లాడుతూ '' అందరి మనసులను హత్తుకునే సినిమా ఇది. అందరూ పల్లెటూరులో విహారించిన అనుభూతి కలుగుతుంది. అందరికి పాత జ్క్షాపకాలు గుర్తుకుతెస్తుంది. ఈ చిత్రంలో తల్లిదండ్రులకు, యూత్‌కు, సమాజానికి నచ్చే అంశాలు ఉన్నాయి. అందరికి 90వ దశకం రోజులను గుర్తకు తెస్తుంది. అందరూ…

Read more
సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలి: ప్రీరిలీజ్‌ వేడుకలో అతిథులు.. Telugu News

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలి: ప్రీరిలీజ్‌ వేడుకలో అతిథులు..

మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. 'లిటిల్ హార్ట్స్', 'రాజు వెడ్స్ రాంబాయి' లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్న సినిమా ఇది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తున్న 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమాను ఈటీవీ విన్‌ అసోసియేషన్‌తో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిక్కి సమర్పణలో హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. మార్చి 6న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్ర…

Read more
‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ట్రైలర్ విడుదల Telugu News

‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ట్రైలర్ విడుదల

‘మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. 'లిటిల్ హార్ట్స్', 'రాజు వెడ్స్ రాంబాయి' లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సమర్పిస్తున్న సినిమా ఇది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తున్న 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' సినిమాను శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. ట్రైలర్ ఓ పక్క నవ్వులు పూయిస్తూనే, మరోపక్క ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. నిజాయితీ గల పంచాయతీ సెక్రటరీగా శివాజీ, ఆయన…

Read more
(TFJA) సభ్యుల సంక్షేమం కోసం  నిర్మాత వంశీ నందిపాటి  విరాళం Telugu News

(TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిర్మాత వంశీ నందిపాటి విరాళం

సినీ జర్నలిస్టుల సంక్షేమం కోసం TFJA చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ప్రశంసనీయం అని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టుల పాత్ర సినీ పరిశ్రమలో ఎంతో ముఖ్యమని, వారి అభ్యున్నతికి అందరూ సహకరించాలని వంశీ నందిపాటి కోరారు. ఈ సందర్భంగా TFJA సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అసోసియేషన్ తరఫున అభినందనలు తెలిపారు. యువ నిర్మాతల నుంచి ఇలాంటి సహకారం రావడం అసోసియేషన్ కు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని వారు పేర్కొన్నారు.

Read more
హే బల్‌వంత్‌’ లో హిలేరియస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో థియేటర్లు ఊగిపోతున్నాయి: కమెడియన్‌ సుదర్శన్‌ Telugu News

హే బల్‌వంత్‌’ లో హిలేరియస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో థియేటర్లు ఊగిపోతున్నాయి: కమెడియన్‌ సుదర్శన్‌

ప్రామిసింగ్‌ కథానాయకుడు సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'హే బల్‌వంత్‌'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ శుక్రవారం ఈనెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల అభినందనలతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో దూసుకపోతుంది. చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించి తన నటనతో థియేటర్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న కమెడియన్‌ సుదర్శన్‌ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలివి. 'హే బల్‌వంత్‌లో సుదర్శన్‌…

Read more
‘ది రైజ్‌ ఆఫ్‌ అశోక్‌’  ట్రైలర్‌ విడుదల Telugu News

‘ది రైజ్‌ ఆఫ్‌ అశోక్‌’ ట్రైలర్‌ విడుదల

సతీష్‌ నీనసాం కథానాయకుడిగా 'కాంతార' ఫేమ్‌ సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'ది రైజ్‌ ఆఫ్‌ అశోక'. కన్నడ, తెలుగు,తమిళ భాషలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి వినోద్‌.వి.దుండలే దర్శకుడు. వృద్ది క్రియేషన్స్ అండ్‌ సతీష్‌ పిక్చర్‌ హౌస్‌ పతాకంపై వర్ధన్‌ హరి, జైష్ణవి, సతీష్ నీనసాం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో కళాసృష్టి ఇంటర్నేషనల్‌ పతాకంపై రవిశంకర్‌ తెలుగులో ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పంపిణి చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 27న ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదల కాబోతుంది. కాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ విడుదల కార్యక్రమం శుక్రవారం చిత్ర టీమ్‌ సమక్షంలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కథానాయకుడు…

Read more