‘రాకాస’ ఏప్రిల్ 3న రిలీజ్
నిహారిక.. జీ స్టూడియోస్ సమర్పణలో తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘రాకాస’. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ అవుతోంది. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, సాంగ్స్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో మూవీపై బజ్ క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలో మేకర్స్ బుధవారం రోజున ట్రైలర్‌ను విడుదల చేశారు. లేటెస్ట్‌గా విడుదలైన ఈ ట్రైలర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచాయి. ‘ఆ కోటలో ఉన్నది.. ఊరు బలి పంపుతున్నది సామాన్యుడికి కాదు.. భీకర బ్రహ్మ రాక్షసుడికి’ అనే డైలాగ్‌తో ‘రాకాస’ ట్రైలర్…
