Skip to content

‘తు యా మైన్’ చిత్రంపై దర్శకుడు మణిరత్నం ప్రశంసల జల్లు

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు బిజోయ్ నంబియార్ తెరకెక్కించిన సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం 'తు యా మైన్' ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి విశేష స్పందనను రాబడుతోంది. శనయ కపూర్, ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, తనదైన ఉత్కంఠభరితమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా దక్షిణాదిలో నిర్వహించిన ఓ ప్రత్యేక స్క్రీనింగ్ లో భారతీయ చలనచిత్ర దిగ్గజం మణిరత్నం ఈ చిత్రాన్ని వీక్షించి, చిత్రబృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. "బిజోయ్ నంబియార్ ఈ చిత్రంలో ఒక కైనెటిక్ ఎనర్జీని తీసుకువచ్చారు. ఇది థియేటర్లలో, ప్రేక్షకుల మధ్య కూర్చొని పెద్ద తెరపై చూసినప్పుడే ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించగలం," అని ప్రశంసించారు. ప్రత్యేక…

Read more

నాగార్జున “గీతాంజలి” మళ్ళీ థియేటర్స్ లో విడుదల !!!

బాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై శ్రీమతి సి. పద్మజ (Proprietor) గారు W/o C.L. Narsareddy గారు నిర్మించిన గీతాంజలి (1989) చిత్రం యొక్క వరల్డ్ వైడ్ (చెన్నై మినహాయించి) రీ-రిలీజ్ హక్కులని శ్రీ పద్మినీ సినిమాస్ అధినేత శ్రీ బూర్లె శివప్రసాద్ గారు గతంలో పొంది వున్నారు. మణిరత్నం గారు దర్శకత్వం వహించి అక్కినేని నాగార్జున గిరిజ షట్టర్ విజయకుమార్ గార్లు నటించిన ఈ చిత్రం యొక్క 4K డిజిటల్ కార్యక్రమాలను అత్యున్నత ప్రామాణికాలతో నిర్వహించి త్వరలో రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ అద్భుతమైన చిత్రాన్ని ఎంతో ప్రేమతో ప్రేక్షకులు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. శ్రీ పద్మినీ సినిమాస్ అధినేత శ్రీ బూర్లె శివప్రసాద్ గారు మాట్లాడుతూ ఈ చిత్రం…

Read more