కార్తి, మోహన్ రాజా, ఎస్. లక్ష్మణ్ కుమార్, ప్రిన్స్ పిక్చర్స్ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్
ప్రిన్స్ పిక్చర్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. హీరో కార్తీ, ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా కాంబినేషన్‌లో కొత్త సినిమా అనౌన్స్ చేసింది. ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం కుటుంబ భావోద్వేగాలతో పాటు హీరోయిజాన్ని అద్భుతంగా మేళవించిన ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. కార్తీ, మోహన్ రాజా కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌లో కార్తీకి ఇది వరుసగా నాలుగో చిత్రం. ఇంతకుముందు 'దేవ్', 'సర్దార్', 'సర్దార్ 2' చిత్రాల తర్వాత మరోసారి ఈ బ్యానర్‌తో ఆయన చేతులు కలపడం విశేషం. ముఖ్యంగా 'సర్దార్ 2' విడుదలకంటే ముందే ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించడం కార్తీ, ప్రిన్స్ పిక్చర్స్ మధ్య ఉన్న బలమైన అనుబంధానికి నిదర్శనం. ఈ సినిమాపై…
