ఇకపై నేను ప్రశాంతంగా మీ కోసం యుద్ధం చేస్తాను – అఖిల్ అక్కినేని
అఖిల్‌కి మరిన్ని విజయాలు దక్కాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను - ‘లెనిన్’ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం 'లెనిన్'. ఈ సినిమాకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ క్రమంలో బుధవారం నాడు గుంటూరులో విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌కి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. అఖిల్ అక్కినేని మాట్లాడుతూ .. ‘‘నందు వల్లే ‘లెనిన్’…
