‘హే చికీతా’ తో అందరికీ మంచి పేరు రావాలి – చదలవాడ శ్రీనివాసరావు
అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ బ్యానర్ల మీద ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి నిర్మించిన చిత్రం ‘హే చికీతా’. అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని ధనరాజ్ లెక్కల తెరకెక్కించారు. ఈ సినిమాని జూలై 24న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. శుక్రవారం నాడు ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్,…
