Skip to content
‘దిల్ దియా ’ టైటిల్  అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ Telugu News

‘దిల్ దియా ’ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో విల‌క్ష‌ణ న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న చైత‌న్య‌రావు మాదాడి క‌థానాయ‌కుడిగా వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ కె.క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న రా అండ్ రూటెడ్ ఫిల్మ్ ‘దిల్ దియా-ఏ నేక్డ్ ట్రూత్’ అనేది ట్యాగ్ లైన్. శ్రియాస్ చిత్రాస్‌, ఎ పూర్ణ నాయుడు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్స్‌పై పూర్ణ నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా టైటిల్, ఫ‌స్ట్ లుక్‌ను సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు. https://x.com/i/status/2007338072154013783 ఈ సినిమా భావోద్వేగాలు, వ్యక్తిగత సంబంధాల మధ్య వచ్చే సంఘర్షణలను చూపించే ట్రెండింగ్‌ డ్రామాగా ఉండబోతుంది. కె. క్రాంతి మాధవ్‌కి ‘దిల్ దియా ..ఏ నేక్డ్ ట్రూత్’ ఆయన ఇప్పటివరకు చేసిన…

Read more
జనవ‌రి 2 నుంచి జీ 5లో క్యూట్ ఎమోష‌న‌ల్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ డ్రామా ‘బ్యూటీ’ స్ట్రీమింగ్ Telugu News

జనవ‌రి 2 నుంచి జీ 5లో క్యూట్ ఎమోష‌న‌ల్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ డ్రామా ‘బ్యూటీ’ స్ట్రీమింగ్

ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ల‌తో వైవిధ్య‌మైన కంటెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ దేశంలోనే టాప్ ఓటీటీ మాద్య‌మాల్లో ఒక‌టిగా గుర్తింపు సంపాదించుకున్న జీ 5..మ‌రోసారి త‌న విల‌క్ష‌ణ‌త‌ను చాటుకుంటూ కొత్త సినిమా ‘బ్యూటీ’తో ప్రేక్ష‌కుల‌కు అందిస్తోంది. డిఫ‌రెంట్ మూవీస్‌లో న‌టిస్తూ మెప్పిస్తోన్న అంకిత్ కొయ్య హీరోగా, నిల‌ఖి పాత్రా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం జీ 5లో జ‌న‌వ‌రి 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. https://x.com/ZEE5Telugu/status/2005890994815000614 హృద‌యాన్ని హ‌త్తుకునే క్యూట్ ల‌వ్‌స్టోరీ ఓ వైపు.. కూతురిపై అప‌రిమిత‌మైన ప్రేమను చూపించే తండ్రి భావోద్వేగం మ‌రో వైపు.. ఈ సంఘ‌ర్ష‌ణ‌లో క‌థ ఎలాంటి మ‌లుపులు తీసుకుంద‌నే ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపులున్న క‌థాంశంతో బ్యూటీ సినిమాను రూపొందింది. సెప్టెంబ‌ర్ 15న విడుద‌లైన ఈ చిత్రం థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌ను…

Read more
‘దండోరా’ సినిమా గురించి 2026 మొత్తం అందరూ మాట్లాడుకుంటారు – నటుడు శివాజీ Telugu News

‘దండోరా’ సినిమా గురించి 2026 మొత్తం అందరూ మాట్లాడుకుంటారు – నటుడు శివాజీ

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని రూపొందించిన తాజా చిత్రం ‘దండోరా’. ఈ చిత్రంలో శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, అదితి భావ‌రాజు త‌దిత‌రులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ‘దండోరా’ మూవీ స‌క్సెస్ మీట్‌లో... శివాజీ మాట్లాడుతూ ‘‘హనుమాన్ ప్రొడ్యూసర్ ఈ సినిమా చూసి ప్రొడ్యూస్ చేయ‌టానికి వ‌చ్చారు. నీల‌కంఠ‌గారైతే త‌రాల‌కొక‌సారే ఇలాంటి సినిమా వ‌స్తుంద‌ని అన్నారు…

Read more
దండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పిన శివాజీ Telugu News

దండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పిన శివాజీ

LIVE: https://www.youtube.com/live/ue4I0v6vlyE Download Link: https://we.tl/t-imi6O1RQhi డండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన భావోద్వేగంతో క్షమాపణ చెప్పారు. వేదికపై తాను రెండు అనుచితమైన పదాలు ఉపయోగించినందుకు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నానని శివాజీ తెలిపారు. స్టేజ్‌పై నుంచి దిగిన వెంటనే తన తప్పు ఎంత పెద్దదో తనకు అర్థమైందని, ఆ మాటలు చెప్పడం పూర్తిగా తప్పేనని ఆయన అంగీక‌రించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో న‌టుడు శివాజీ మాట్లాడుతూ ‘‘నేను ఆరోజు స్టేజీ మీద ఉన్న నా తోటి న‌టీన‌టుల‌కు, ఆడ‌బిడ్డ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాను. ఆ రెండు ప‌దాల‌ను మాట్లాడకుండా ఉండాల్సింది. జీవితంలో అలా ప‌దాల‌ను…

Read more
దండోరా’ సినిమా  విజయం సాధించాలి – డైరెక్టర్ అనిల్ రావిపూడి Telugu News

దండోరా’ సినిమా విజయం సాధించాలి – డైరెక్టర్ అనిల్ రావిపూడి

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని రూపొందించిన తాజా చిత్రం ‘దండోరా’. ఈ చిత్రంలో శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు త‌దిత‌రులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో.. అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. ‘‘దండోరా’…

Read more