బ్లాక్‌బస్టర్ సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ‘పతంగ్’ లో ఉన్నాయి: ట్రైలర్ ఆవిష్కరణలో దర్శకుడు దేవా కట్టా
ట్రైలర్ ఆవిష్కరణలో దర్శకుడు దేవకట్టా ప్రతిష్టాత్మక సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు సమర్పణలో రూపొందుతున్న చిత్రం 'పతంగ్' పతంగుల పోటీతో రాబోతున్న ఈ యూత్‌ఫుల్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ , రిషన్ సినిమాస్, మాన్సూన్ టేల్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా ఈ చిత్రానికి విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. పాపులర్ దర్శకుడు నటుడు గౌతమ్ వాసుదేవ మీనన్, ప్రముఖ సింగర్, నటుడు ఎస్పీ…
