#NBK111 పవర్‌ఫుల్ టైటిల్ ‘దాదా’, మాస్ ను మెస్మరైజ్ చేసిన టైటిల్ గ్లింప్స్
గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #NBK111, బాలయ్య పుట్టినరోజున "ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా" అనే టైటిల్‌తో గ్లింప్స్ విడుదలైనప్పటి నుండి భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను పోస్టర్, పవర్ ఫుల్ గ్లింప్స్ ద్వారా ప్రకటించారు. #NBK111కు ‘దాదా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. బాలకృష్ణ పోషిస్తున్న పాత్ర స్వభావాన్ని ప్రజెంట్ చేసేలా ఈ టైటిల్ ఉంది. పోస్టర్‌లో బాలకృష్ణ మాస్ అవతార్‌లో కనిపించారు. సన్‌గ్లాసెస్, లెదర్ జాకెట్, మెడలో భారీ గోల్డ్ చైన్‌తో స్టైలిష్‌గా కనిపించిన ఆయన.. భుజంపై వెపన్‌తో…
