టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన ‘గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్.. దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ
ఓ వ్యక్తి జీవిత చరిత్రను తెరపైకి తీసుకు రావడం అంటే అంత సాధారణమైన విషయమేమీ కాదు. పైగా ఓ రాజకీయ నాయకుడు.. అజాత శత్రువు.. నిజాయితీ పరుడు.. ప్రజల కోసం బతికే నాయకుడైన గుమ్మడి నర్సయ్య లాంటి వ్యక్తి చరిత్రను తెరపైకి తీసుకు వస్తుండటం సాహసం అనే చెప్పాలి. ఆ సాహసాన్ని యంగ్ డైరెక్టర్ పరమేశ్వర్ హివ్రాలే చేస్తున్నారు. ఈ సాహసానికి ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ తరుపున ఎన్. సురేష్ రెడ్డి అండగా నిలబడ్డారు. ఇక ‘గుమ్మడి నర్సయ్య’గా కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ కనిపించబోతోన్నారు. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన ‘గుమ్మడి నర్సయ్య’ మోషన్ పోస్టర్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. గుమ్మడి నర్సయ్య పాత్రలో…
