ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా పీఆర్ షో బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం అనౌన్స్మెంట్
రచయితగా, దర్శకుడిగా, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు నిర్మాతగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. “పీఆర్ షో” పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్లో తొలి సినిమాగా, డ్యూడ్ సినిమాలో ఆయనతో కలిసి నటించిన మమిత బైజు, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అశ్వత్ మారిముత్తు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో శివాజీ సొంటినేని, స్వాసిక, అనామిక మహి, లిజ్జీ ఆంటోని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న సాయి అభ్యంక్కర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను స్టైలిష్ అనౌన్స్మెంట్ వీడియోతో అధికారికంగా ప్రకటించారు. ఇందులో నటీనటులు, టెక్నికల్ టీమ్‌ను ఆసక్తికరంగా పరిచయం చేశారు. ఈ సినిమాకు కథను ప్రదీప్…
