‘పళ్ళ బురుసు’ సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు: దర్శకుడు ఉదయ్ చౌహాన్
అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న చిత్రం పళ్ళబురుసు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ‘పళ్ళ బురుసు’ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్ చౌహాన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీ నేపథ్యం గురించి చెప్పండి? ‘పళ్ళ బురుసు’ ఎలా మొదలైంది? మాది మహబూబ్‌నగర్ జిల్లా. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. నాకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే చాలా ఇష్టం. ఇంట్లో డాక్టర్ చదవని చెప్పారు. కానీ సినిమాలపై…
