‘సరస్వతి’ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది: వరలక్ష్మి శరత్ కుమార్
వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం 'సరస్వతి'. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తో ఘన విజయాన్ని సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు. థాంక్యూ మీట్లో హీరోయిన్ &డైరెక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. నేను నిన్న చాలా థియేటర్స్ కి వెళ్లాను. ప్రతి సీన్ కి ప్రతి డైలాగ్స్ చప్పట్లు కొడుతున్నారు. క్లైమాక్స్ చూసి…
