‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’ ట్రైలర్ లాంచ్
ఫ్యాషన్ హంట్ సమర్పణలో ప్రిన్స్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నజీం ఎస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’. ఈ సినిమాతో ప్రిన్స్, సాంచి కశ్యప జంటగా తెరకు పరిచయం కాబోతోన్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను మంగళవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో .. ప్రిన్స్ మాట్లాడుతూ .. ‘మేం అంతా ఎంతో కష్టపడి ‘అటు ఫ్రెండ్ ఇటు లవర్’ సినిమాని తీశాం. అందరి సహకారంతోనే చిత్రాన్ని పూర్తి చేయగలిగాం. దర్శకుడు ఈ మూవీని ఎంతో గొప్పగా చిత్రీకరించారు. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో మాకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. తెలుగు ఆడియెన్స్ మంచి చిత్రాల్ని ఎప్పుడూ ఆదరిస్తూనే…
