పద్మశ్రీ’ పురస్కారం తర్వాత విడుదలయ్యే రాజేంద్రప్రసాద్ మొదటి చిత్రం ‘పిఠాపురంలో’
“ ప్రేయసి రావే, అయోధ్య రామయ్య, చెప్పాలని వుంది, జోరుగా హుషారుగా, ఒక్కడే, హనుమంతు, ఆలస్యం అమృతం, రెడ్ అలర్ట్” వంటి చిత్రాలతో దర్శకునిగా మంచి గుర్తింపు సంపాదించారు మహేష్ చంద్ర . తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పిఠాపురంలో’. దీనికి ఉపశీర్షిక ‘అలా మొదలైంది’ . ఈ చిత్రంలో ‘నటకిరీటి’ డా. రాజేంద్రప్రసాద్, పృధ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, Jr. పవన్ కళ్యాణ్, J.D.V ప్రసాద్, K.A. పాల్ రాము, జబర్దస్త్ శేషు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మహేష్ చంద్ర సినిమా టీమ్ బ్యానర్‌పై దుండిగల్ల…
