‘అగధ’ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను: కామాక్షి భాస్కర్ల
‘అగధ’ కోసం బుద్ధిజం పుస్తకాల్ని చదివాను. బ్లాక్ మ్యాజిక్ గురించి తెలుసుకున్నాను - కామాక్షి భాస్కర్ల శ్యాం ప్రసాద్ రెడ్డి గారి లాంటి పెద్ద నిర్మాత నన్ను అనుష్కతో పోల్చడం ఆనందంగా అనిపించింది - కామాక్షి భాస్కర్ల కామాక్షి భాస్కర్ల ఎంచుకునే సినిమాలు, కథలు, సాధిస్తున్న విజయాల గురించి అందరికీ తెలిసిందే. కంటెంట్ ఓరియెంట్ ప్రాజెక్ట్‌లని చేస్తూ దూసుకుపోతోన్న కామాక్షి భాస్కర్ల రేపు (ఆగస్ట్ 14) ‘అగధ’ అంటూ రాబోతోన్నారు. ఈ సినిమాని శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో ఎం.ఎస్. రాజు తెరకెక్కించారు. ఈ మూవీలో కామాక్షి భాస్కర్లతో పాటు శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్,…
