Skip to content

సెన్సేషనల్ డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా ‘వసుదేవసుతం’ ట్రైలర్ విడుదల

మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా రెయిన్‌బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’. ఈ సినిమాని జూలై 10న రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌ ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి. ఇక రేపు (జూలై 10) మూవీ విడుదలవుతున్న తరుణంలో మరింత హైప్ పెంచేందుకు రిలీజ్ ట్రైలర్‌ను తీసుకు వచ్చారు మేకర్స్. సెన్సేషనల్ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘చంపడం నాకు సరదా కాదు.. అలా అని క్షమించడం చేతకాదు’, ‘కొన్ని తప్పుల్ని క్షమించొచ్చు.. అన్ని తప్పులు క్షమిస్తే.. మనం తప్పు చేసినట్టే’, ‘దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే ఎవ్విడికీ భూమ్మీద బతికే హక్కు లేదు’ అనే డైలాగ్స్‌తో సాగిన ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఇందులోని వీఎఫ్ఎక్స్ షాట్స్, దేవుడ్ని చూపించిన షాట్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా అదిరిపోయాయి. ఇక మణిశర్మ ఇచ్చిన బీజీఎం అయితే ట్రైలర్‌లో నెక్ట్స్ లెవెల్లో వినిపిస్తోంది.

ట్రైలర్ వీక్షించిన అనంతరం అజయ్ భూపతి చిత్రయూనిట్‌ను అభినందించారు. టీజర్ బాగుందని, విజువల్స్, యాక్షన్ అన్నీ బాగున్నాయని మెచ్చుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు. ఆల్రెడీ సెన్సార్ నుంచి ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమా ఉందని, కొత్త కథతో సరికొత్తగా తీశారని సెన్సార్ సభ్యులు అభినందించారు. ఈ చిత్రానికి జిజ్జు సన్ని (పార్కింగ్ ఫేమ్) కెమెరామెన్‌గా పని చేశారు. ఇక ఈ మూవీని రేపు (జూలై 10) భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

తారాగణం : మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి, జాన్ విజయ్, మైమ్‌ గోపి, సురేష్‌చంద్ర మీనన్, ఈశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్, సుమేత బజాజ్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:

బ్యానర్: రెయిన్‌బో సినిమాస్
నిర్మాత: ధనలక్ష్మి బాదర్ల
రచయిత & దర్శకుడు: వైకుంఠ్ బోను
సంగీతం: మణిశర్మ
DOP: జిజ్జు సన్నీ (పార్కింగ్ ఫేమ్)
లిరిసిస్ట్: చైతన్య ప్రసాద్, శ్రీ హర్ష ఈమని
ఫైట్స్: బింబిసార రామకృష్ణ
కోరియోగ్రఫీ : అజయ్ సాయి
పీఆర్వో : సాయి సతీష్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.