‘హుషారు 2’ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది – ఆర్. నారాయణమూర్తి
హెచ్‌కే ఫిల్మ్స్, కలియుగ వారధ క్రియేషన్స్ బ్యానర్ల మీద రాహుల్ వర్మ, కె. వీణా రాణి, కె. హనుమంత్ రాజు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘హుషారు 2’. ఈ మూవీకి శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా, రవి ఆంటోనీ, దినేష్ తేజ్, శశిధర్, రాజై రోవన్, అభిజ్ఞ, శ్రీకాంత్ కన్ని, బాబీ రాచకొండ ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీ టీజర్‌ని మంగళవారం నాడు రిలీజ్ చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌కి పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో.. పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ .. ‘హర్ష గారు ‘హుషారు 2’లో…
