2026లో మా బ్యానర్ లో ఓ పెద్ద సినిమా ఉంటుంది: నిర్మాత రాజేశ్ దండా
హాస్య మూవీస్ బ్యానర్ పై సామజవరగమన, ఊరు పేరు భైరవకోన, కే రాంప్ లాంటి వరుస బ్లాక్ బస్టర్స్ అందించిన సక్సెస్‌ఫుల్ నిర్మాత రాజేశ్ దండా. ప్రస్తుతం ఆయన ప్రొడక్షన్ నుంచి అల్లరి నరేశ్ హీరోగా ఒక సినిమా, సంయుక్త ప్రధాన పాత్రలో “బ్లాక్ గోల్డ్” చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మార్చి 19 ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న తాజా ప్రాజెక్ట్స్, భవిష్యత్ ప్రణాళికల గురించి విలేకరులతో ముచ్చటించారు. ఉగాది, మీ బర్త్‌డే ఒకేరోజు రావడం ఎలా అనిపించింది? -ఉగాది, నా బర్త్‌డే ఒకేరోజు రావడం చాలా సర్ ప్రైజ్ గా అనిపించింది. కొత్త సంవత్సరంలో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైమ్, దాదాపు 15 ఏళ్ల తర్వాత…
