ఐక్య’ నా బిడ్డ లాంటిది” – మనోజ్ మంచు ఎమోషనల్ కామెంట్స్
టాలీవుడ్‌లో ప్రముఖ స్టార్ హీరో రా కింగ్ మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్‌ని అలరించారు. ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాల్ని చేస్తూ, డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాల్ని తీస్తూ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు మంచు మనోజ్. అలాంటి హీరో తన పుట్టిన రోజు (మే 20) సందర్భంగా మంగళవారం నాడు మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. తన ఐక్య ట్రస్ట్, తన సినీ ప్రయాణం, రాజకీయ ప్రవేశం వంటి విషయాల గురించి ఎన్నో విశేషాల్ని పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన చెప్పిన సంగతులివే.. ‘ఐక్య’ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? నేను సూపర్ మ్యాన్‌ని కాదు. అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకే ఈ ట్రస్ట్‌ను పెట్టాలని అనుకున్నాం. వాయిస్ లెస్‌కి…
