Skip to content

డిజిటల్‌లోనూ అఖండ రికార్డు

మాస్ ప్రేక్షకుల అభిరుచిని అద్భుతంగా అర్థం చేసుకుని వరుస బ్లాక్‌బస్టర్లు అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను. పవర్‌ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, హీరో ఎలివేషన్స్‌ను తనదైన శైలిలో చూపిస్తూ 'భద్ర', 'సింహ', 'లెజెండ్', 'సరైనోడు', 'అఖండ' వంటి విజయవంతమైన చిత్రాలను అందించారు. ఎంతోమంది కొత్త ఆర్టిస్టులకు అవకాశాలు కల్పించిన దర్శకుడిగానూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు థియేటర్లలోనే కాదు, డిజిటల్ వేదికపైనా బోయపాటి తన సత్తా చాటారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'జయ జానకి నాయక' హిందీ డబ్బింగ్ వెర్షన్ 'ఖూంఖార్' యూట్యూబ్‌లో ఏకంగా 1 బిలియన్ వ్యూస్ సాధించి అరుదైన రికార్డు నెలకొల్పింది. 2019లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ మైలురాయిని అందుకున్న తొలి సినిమాగా నిలిచింది. ఈ…

Read more
అట్టహాసంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” ప్రారంభం Telugu News

అట్టహాసంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” ప్రారంభం

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఎందరో హీరోయిన్ లకు వివిధ సినిమాలలో మేకప్ వేస్తూ వచ్చిన ప్రముఖ మేకప్ మాన్ కడాలి చక్రవర్తి(చక్రి) గారు హైదరాబాద్ లోని పంజాగుట్టలో నూతనంగా "సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ" ప్రారంభించడం జరిగింది. గతంలో రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, కత్తి శెట్టి వంటి ఎందరో స్టార్ హీరోయిన్లకు మేకప్ మాన్ గా పనిచేసిన చక్రి గారు తానే సొంతంగా ప్రారంభించిన ఈ నూతన మేకప్ స్టూడియోను ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నాతో కొన్నేళ్లుగా ఉంటూ…

Read more