‘పెద్ది’ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా స్పోర్ట్స్-యాక్షన్ డ్రామా 'పెద్ది' ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. మార్చి 27న విడుదల చేయాలని భావించిన ఈ సినిమాను వేసవి సెలవుల్ని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 30కి మార్చారు. ఈ అదనపు సమయంతో మేకర్స్ భారీ స్థాయిలో ప్రమోషన్స్‌కు సిద్ధమవుతున్నారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో రామ్ చరణ్ మాస్ లుక్‌లో అదరగొట్టారు. పొడవైన జుట్టు, రగ్గడ్ గడ్డం, నోస్ రింగ్‌తో ఆయన లుక్ ఇంటెన్స్ గా కనిపిస్తోంది. ఆయన పదునైన చూపు నేరుగా గుండెల్లోకి దూసుకెళ్తుంది. చుట్టూ అలసిపోయిన, ముఖాల్లో వేదన కనిపించే జనసమూహం మధ్య నుంచి ఆయన రావడం ఎమోషన్ ని…
