మహేష్ బాబు లాంచ్ చేసిన ‘శ్రీనివాస మంగాపురం’ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్
ఘట్టమనేని కుటుంబం నుంచి సరికొత్త స్టార్ తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయ కృష్ణ ఘట్టమనేని సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. అతని మొదటి చిత్రం 'శ్రీనివాస మంగాపురం'కు RX 100, మంగళవారం లాంటి మరపురాని సినిమాని అందించిన అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్ పై పి. కిరణ్ నిర్మించారు. ఈ చిత్రం టైటిల్, ప్రీ-లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు తన అన్న కొడుకైన జయ కృష్ణ తొలి చిత్రం పవర్ ఫుల్ ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు. ఫస్ట్ లుక్‌లో జయ కృష్ణ…
