Skip to content

‘శ్రీనివాస మంగాపురం’ నుంచి వెంకటప్పయ్య నాయుడుగా మోహన్ బాబు ఫెరోషస్ ఫస్ట్ లుక్ రిలీజ్

‘శ్రీనివాస మంగాపురం’ నుంచి వెంకటప్పయ్య నాయుడుగా మోహన్ బాబు ఫెరోషస్ ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

హార్డ్ హిట్టింగ్ సినిమాలు అందించడంలో పాపులరైన దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం’ శ్రీనివాస మంగాపురం’ చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. వైరల్ అయిన ఉయ్ అమ్మ ట్రాక్‌తో దేశవ్యాప్తంగా అలరించిన తర్వాత రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అగ్ర నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. నిర్మాత పి కిరణ్ నిర్మిస్తున్న శ్రీనివాస మంగాపురం ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌లతో స్ట్రాంగ్ బజ్‌ను సృష్టించింది.

ఈరోజు, మేకర్స్ ఈ చిత్రంలో మరో ప్రముఖ పాత్రను పరిచయం చేశారు. వెంకటప్పయ్య నాయుడుగా మోహన్ బాబు ఫెరోషస్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది. పోస్టర్‌లో ఆయన ఇంటెన్స్ గా నడుస్తూ, రా అథారిటీని ప్రజెంట్ చేశారు. సాల్ట్ అండ్ పెప్పర్ జుట్టు, మీసం ఆయన ఫియర్స్ వ్యక్తిత్వాన్ని మరింత హైలైట్ చేస్తుంటే, తెల్లటి కుర్తా–ధోతి ఆయనను శక్తివంతమైన గ్రామ పెద్దగా చూపిస్తోంది. మెడలో బంగారు గొలుసులు, చేతికి వాచ్, బ్రేస్లెట్ వింటేజ్ మాస్ టచ్‌ను అందిస్తున్నాయి. ఆయన వెనుక తుపాకులతో నిలిచిన మనుషుల సమూహం చూస్తుంటే గౌరవంతో పాటు భయాన్ని కూడా కలిగించే వ్యక్తి అర్ధమౌతుంది.

మొత్తంగా ఈ పోస్టర్ తన నేలను గొప్ప సంకల్పంతో పాలించే వ్యక్తి స్వభావాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. మోహన్ బాబు ఇప్పటికే టీమ్‌లో చేరగా, సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది.

టాప్ టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. సంగీతాన్ని జివి ప్రకాశ్ కుమార్ సమకూరుస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జయకృష్ణ ISC, ఎడిటింగ్ బాధ్యతలను మాధవ్ కుమార్ గుల్లపాటి నిర్వహిస్తుండగా, ప్రొడక్షన్ డిజైనర్ సాహి సురేష్. హై-ఇంటెన్సిటీ యాక్షన్ సన్నివేశాలకు రియల్ సతీష్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

దర్శకుడి కమాండింగ్ విజన్, కథను ముందుకు నడిపించే కొత్త లీడ్ పెయిర్, నెగటివ్ షేడ్స్‌తో కనిపించనున్న సీనియర్ పెర్ఫార్మర్ మోహన్ బాబు, గొప్ప థీమాటిక్ కాన్వాస్ తో “శ్రీనివాస మంగాపురం” అంచనాలని పెంచుతోంది.

నటీనటులు: జయ కృష్ణ ఘట్టమనేని, రాషా తాడాని, మోహన్ బాబు

సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: అజయ్ భూపతి
సమర్పణ: అశ్విని దత్
నిర్మాత: పి.కిరణ్
బ్యానర్: చందమామ కథలు
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
DOP: జయకృష్ణ ISC
ఎడిటర్: మాధవ్ కుమార్ గుళ్లపాటి
ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాకమూరి నారాయణ స్వామి
ఫైట్స్: రియల్ సతీష్
PRO: వంశీ-శేఖర్

See also  మత్స్యకారుల బతుకుపోరాటం: 'అరేబియా కడలి'

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.