Skip to content

‘మ్యాడ్ ఫర్ ఈచ్ అధర్’ షో కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఈ షోకి జడ్జ్ గా వుండటం ఆనందంగా ఉంది: ప్రెస్ మీట్ లో రావిపూడి

‘మ్యాడ్ ఫర్ ఈచ్ అధర్’ షో కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఈ షోకి జడ్జ్ గా వుండటం ఆనందంగా ఉంది: ప్రెస్ మీట్ లో రావిపూడి Telugu News
‘మ్యాడ్ ఫర్ ఈచ్ అధర్’ షో కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఈ షోకి జడ్జ్ గా వుండటం ఆనందంగా ఉంది: ప్రెస్ మీట్ లో రావిపూడి Telugu News

అఫీషియల్ ప్రీమియర్‌ కి ముందే జియోహాట్‌స్టార్ రూపొందిస్తున్న కొత్త రియాలిటీ షో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అధర్’ ఇప్పటికే భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. షో చిత్రీకరణ జరుగుతున్న గ్రాండ్ లొకేషన్ “లవ్ మాన్షన్” లోపలి ఎక్స్‌క్లూజివ్ చిత్రాలు బయటికి వచ్చాయి.

ఈ విశాలమైన మాన్షన్‌లో ప్రస్తుతం 10 మంది సెలబ్రిటీ జంటలు 70 రోజుల ప్రయాణానికి సిద్ధమయ్యారు. ప్రేమ, నమ్మకం, సహనం, భాగస్వామ్యాన్ని 24/7 కెమెరాల పర్యవేక్షణలో పరీక్షించే విధంగా ఈ లవ్ మాన్షన్‌ను డిజైన్ చేశారు.

మాన్షన్‌లో ఇప్పటికే కొన్ని జంటలు మరింత బలపడుతుండగా, మరికొన్ని జంటల మధ్య అనుకోని భావోద్వేగ ఘర్షణలు జరుతున్నాయి. బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా, నిరంతరం కెమెరాలు రికార్డ్ చేస్తున్న ఈ లవ్ మాన్షన్ ఇప్పటికే రియాలిటీ టెలివిజన్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారింది.

జియోహాట్‌స్టార్ నుండి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. ప్రేక్షకులు ఈ కొత్త రియాలిటీ ప్రయాణానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హిట్ మిషన్ అనిల్ రావిపూడి, హీరోయిన్స్ రాధ, లయ ఈ షోకి జ్యూరీగా వుండటం మరింత ప్రత్యేకతని తీసుకొచ్చింది. ప్రముఖ యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్నారు. తాజగా మీడియా ప్రతినిధులకు ఈ షోకి సంబధించిన స్పెషల్ ప్రోమోని ప్రదర్శించారు.

ప్రెస్ మీట్‌లో హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ షో ఐడియా, కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. ఈ మాన్షన్‌లో పోటీ ప్రేమలో కాదు… ఉన్న పది మంది కపుల్స్‌లో ఎవరు స్పోర్టివ్‌గా ముందుకు వెళ్తారనేదే ముఖ్యం. షో అద్భుతంగా జరుగుతోంది. మనం లైఫ్ స్టోరీస్‌కు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాం. అలాంటి అద్భుతమైన పది కపుల్స్ స్టోరీస్ ఇందులో ఉన్నాయి. ఇలాంటి షోకు జడ్జ్‌గా చేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. వాళ్ల లైఫ్ ఎక్స్‌పీరియెన్స్ వినడం, మనకు తెలిసిన సలహాలు చెప్పడం ఒక కొత్త అనుభూతి. తెలుగులో ఇలాంటి షో ఫస్ట్ టైమ్. శ్రీముఖి హోస్ట్‌గా ఉంటారు. అలాగే నాతో పాటు జడ్జ్‌గా డ్రీమ్ గర్ల్ రాధ గారు ఉండటం ఆనందంగా ఉంది. చిరంజీవి గారు, రాధ గారి పాటలకు నేను డ్యాన్స్ చేస్తూ పెరిగాను. అలాంటి రాధ గారితో షోకు జడ్జ్‌గా ఉండటం ఆనందంగా ఉంది. వారి లైఫ్ ఎక్స్‌పీరియెన్స్ చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే మరో జడ్జ్ లయ గారు చాలా స్పోర్టివ్‌గా వారి లైఫ్ ఎక్స్‌పీరియెన్స్ షేర్ చేస్తున్నారు.

హీరోయిన్ రాధ మాట్లాడుతూ.. చాలా ఏళ్ల తర్వాత ప్రెస్ మీట్‌లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. నేను డ్యాన్స్, కుకింగ్ ఏ షో చేసినా ఎంజాయ్ చేస్తూనే చేశాను. ఈ షో మాత్రం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇది నాకు పర్సనల్‌గా కనెక్ట్ అయ్యింది. ఇందులో కపుల్స్ అందరూ చాలా స్పోర్టివ్‌గా ఉన్నారు. అనిల్ గారు, లయ గారితో కలిసి జ్యూరీలో ఉండటం ఆనందంగా ఉంది. హ్యాపీ మ్యారేజ్ అంటూ ఏమీ ఉండదు. మ్యారేజ్‌ను హ్యాపీగా చేయాల్సిన బాధ్యత మన చేతిలోనే ఉంటుంది. అది ఈ షోలో ప్రజెంట్ చేస్తున్న తీరు చాలా కొత్తగా ఉంది.

See also  డా. మురళీ మోహన్ ప్రధాన పాత్రలో ఆది అక్షర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కిస్తున్న ‘సుప్రీమ్ వారియర్స్’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

హీరోయిన్ లయ మాట్లాడుతూ.. చాలా ఏళ్ల తర్వాత ఒక రియాలిటీ షోలో జడ్జ్‌గా చేస్తున్నాను. ఈ కాన్సెప్ట్‌కు వెంటనే కనెక్ట్ అయ్యాను. ఒక రిలేషన్‌షిప్‌పై ఇలాంటి షో ఇప్పటివరకు రాలేదు. రియల్ కపుల్స్ లవ్ జర్నీ చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. లవ్ ఒక్కో స్టేజ్ దాటుకుని మ్యారేజ్ వరకు రావడం చాలా కొత్త ఆలోచన. అనిల్ గారు ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎంతో దగ్గరైన డైరెక్టర్. ఆయన చెప్పే సలహాలు చాలా ఉపయోగపడతాయి. అలాగే రాధ గారితో కలిసి ఈ షోకు జడ్జ్‌గా చేయడం చాలా ఆనందంగా ఉంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.