తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి మోహన్ బాబు పదిహేను లక్షలు విరాళం
దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టిన రోజు (మే 4)ని డైరెక్టర్స్ డేగా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDA) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కలయిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సోమవారం నాడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారత చలన చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులెంతో మంది హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో పలు భాషలకు చెందిన ప్రముఖ దర్శకులెందరినో సత్కరించారు. ఈ కార్యక్రమంలో.. మోహన్ బాబు మాట్లాడుతూ .. ‘తండ్రిలాంటి దాసరి గారు లేరనే లోటు నాకు ఈ జీవితాంతం ఉంటుంది. ఓ సాధారణ వ్యక్తిని తీసుకు వచ్చి మోహన్ బాబుగా మార్చారు. హిందీ చిత్ర దర్శకుడు బాల్కి గారికి ఈ అవార్డుని ఇవ్వడం ఆనందంగా ఉంది. దర్శకుడు అనే పదానికి…
