‘29’.. టైటిల్ టీజర్.. ఫస్ట్ లుక్ విడుదల
ప్రముఖ నిర్మాణ సంస్థ స్టోన్ బెంచ్ స్టూడియో, జీ స్క్వాడ్ కలయికలో రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ మూవీకి ‘29’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బుధవారం ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. 29 సినిమాకు రత్నకుమార్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. రియలిజం, ఫీల్ గుడ్, రా ఎమోషన్స్‌తో యూనిట్ స్టోరీతో ఈ సినిమాను ఈయన రూపొందిస్తున్నారు. మెయ్యాద మాన్, ఆడై, గులు గులు వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత గ్రిప్పింగ్ స్టోరీతో, హృదయాలను హత్తుకునే మానవ సంబంధాలను తెలియజేసేలా, ప్రేమ గొప్పదనాన్ని తెలియజేసేలా ప్రేమ కథా చిత్రంగా 29 రానుంది. విదు, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రల్లో నటించారు. వారి మధ్య కెమిస్ట్రీ, పాత్రల్లోని గాఢత 29…
