మాస్ జాతర’ చిత్రం నుండి ‘హుడియో హుడియో’ విడుదల
'మాస్ జాతర' చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన 'తు మేరా లవర్', 'ఓలే ఓలే' గీతాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకొని, సామాజిక మాధ్యమాల్లో ఉర్రూతలూగించాయి. తాజాగా చిత్ర బృందం, మూడవ గీతంగా 'హుడియో హుడియో' అనే సరికొత్త మెలోడీని ప్రేక్షకులకు అందించింది. మాస్ మరియు మెలోడీని అందంగా మిళితం చేసిన ఈ మనోహరమైన ట్యూన్, అందరినీ కట్టిపడేస్తోంది. ఈ గీతం సినిమా మరియు ఆల్బమ్ రెండింటికీ సరైన భావోద్వేగ లయను తాకుతుంది. రెండు ఉత్సాహభరితమైన పాటలతో అందరినీ కాలు కదిపేలా చేసిన తర్వాత, ఇప్పుడు శ్రోతల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకునే ఓ మంచి మెలోడీతో వచ్చారు. మునుపటి మాస్ మహారాజా రవితేజను తిరిగి తీసుకొని వస్తున్నట్టుగా మాస్-క్లాస్ కలిసిన ఆరా ఇందులో…
