‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి వసంత్.. లుక్ పోస్టర్ విడుదల
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమా నుంచి వస్తోన్న క్రేజీ అప్‌డేట్స్‌తో అంచనాలు రోజు రోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఈ భారీ యాక్షన్ డ్రామాలో రుక్మిణి వసంత్ ను మెలిస్సా పాత్రలో పరిచయం చేస్తూ లుక్ పోస్టర్‌ను మేకర్స్ మంగళవారం రోజున రిలీజ్ చేశారు. పోస్టర్‌ను గమనిస్తుంటే ఆమె అందంగా, అధికారంతో, ఎలాంటి భయం లేకుండా కనిపించనుందనే పాత్రలో కనిపించనుందనే విషయం తెలుస్తోంది. యష్, గీతూ మోహన్ దాస్ కాంబో అనౌన్స్‌మెంట్ రోజు నుంచే అందరిలోనూ ఎగ్జయిట్‌మెంట్‌ను క్రియేట్ చేసింది. ఇప్పుడు యష్‌తో కలిసి రుక్మిణి వసంత్ నటించటంతో ఇదింకా ప్రత్యేకతంగా అనిపిస్తోంది. డైరెక్టర్ గీతు కథలో చెప్పాలనుకున్న డెప్త్, సీరియస్‌నెస్ అర్థం…
