‘వంద దేవుళ్ళు’ సినిమా నుంచి ‘అమ్మా అమ్మేగా’ పాట విడుదల
విజయ్ ఆంటోని, శశి దర్శకత్వంలో వచ్చిన ‘బిచ్చగాడు’, అందులోని అమ్మ పాటకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఇప్పటికీ అమ్మ పాట అంటే అందరూ ఆ పాటనే ఎంచుకుంటారు. మళ్లీ అలాంటి ఓ ఎమోషనల్ మదర్ సాంగ్‌తో విజయ్ ఆంటోని, శశి ఆడియెన్స్ ముందుకు వచ్చారు. వీరి కాంబోలో ‘బిచ్చగాడు’ తరువాత ‘వంద దేవుళ్ళు’ అనే సినిమా రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్‌తో సినిమా మీద అంచనాలు ఆకాశన్నంటాయి. ఇక తాజాగా ‘వంద దేవుళ్ళు’ నుంచి ‘అమ్మ అమ్మేగా’ అంటూ అమ్మ గొప్పదనం గురించి చెప్పే పాటను విడుదల చేశారు. వంద దేవుళ్లే దిగివచ్చినా అని భాష్యశ్రీ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేశారో.. మళ్లీ ఇప్పుడు ‘అమ్మ అమ్మేగా’…
